వనసీమలో ఆవిర్భవించిన మహా శక్తి మేడారం… సమ్మక్క–సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ పవిత్ర మహోత్సవానికి లక్షలాది కాదు, కోట్లాది భక్తులు తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వనదేవతల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. విశాలమైన రోడ్లు, నీటి సదుపాయాలు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మేడారం ఆలయ అభివృద్ధి మరింత ఘనంగా రూపుదిద్దుకుంది. ఈసారి భక్తుల సౌకర్యం కోసం యాప్, వెబ్‌సైట్, వాట్సాప్ చాట్‌బాట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం అడుగులు వేయగానే అలసట మరిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతి మేడారం ప్రత్యేకత. భక్తి, సంప్రదాయం, ఆధునిక సౌకర్యాలు కలసిన ఈ మహాజాతరలో పాల్గొనడం నిజంగా జన్మధన్యం.

