Site icon Bhakthi TV

తమిళనాడు ప్రభుత్వం దేవాలయాల విషయంలో కీలక నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రసిద్ది చెందిన దేవాలయాలున్నాయి. అయితే కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్దిగంచాయి. ఈ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. స్వామివారికి తమ శక్తికొలదీ బంగారు, వెండి వంటి విలువైన వస్తువులతో పాటు నగదుని కూడా సమర్పిస్తారు. తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 21 దేవాలయాల నుంచి వెయ్యి కిలోల బంగారాన్ని సేకరించి ముంబైలోని ప్రభుత్వ టంకశాలలో కరిగించి 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా మార్చింది.

అనంతరం ఈ కడ్డీలను బంగారు పెట్టుబడి పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసి ఏడాదికి రూ.17.81 కోట్ల వడ్డీని ఆర్జించింది. ఈ డబ్బుతో దేవాలయాల్లోని సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి చేయడానికి వినియోగించనుంది. ఇక పలు దేవాలయాల్లో సేకరించిన బంగారంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న సమయపురంలోని అరుళ్మిగు మరియమ్మన్ ఆలయం నుంచి అత్యధికంగా బంగారం విరాళం వచ్చింది. ఈ ఆలయం నుంచి బంగారం పెట్టుబడి పథకానికి నిరుపయోగంగా ఉన్న దాదాపు 424.26 కిలోల బంగారాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

Share this post with your friends
Exit mobile version