Site icon Bhakthi TV

డిసెంబరు 30 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 30 నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనోత్సవాలు వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 23వ తేదీ వరకూ వైభవంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. దీనికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.

అలాగే ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర నిర్వహించనున్నారు. అనంతరం 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Share this post with your friends
Exit mobile version