Site icon Bhakthi TV

శ్రీరామనవమి నాడు మీ ఆత్మీయులను ఇలా విష్ చేయండి..!

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న దగ్గర నుంచి జనాలకు డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక హిందువులకు పండుగలు మరింత ప్రత్యేకం. ఈ మధ్య కాలంలో కొంత మంది తెలిసినవారు ఒకరికొకరు ఎదురు పడితే జై శ్రీరాం అని విష్ చేసుకుంటున్నారు. ఈ మార్పునకు అయితే చాలా సంతోషం. ఇక సెల్‌ఫోన్‌లో విష్ చేసుకునే సమయంలో కాస్త సంప్రదాయబద్దంగా ఉంటే చూసేవారికి కూడా బాగుంటుంది. శ్రీరామనవమి పండుగ రోజున ప్రత్యేకంగా విష్ చేస్తే చాలా బాగుంటుంది కదా.. మరి ఆ విషెస్ ఎలా చెప్పాలి? అంటారా? మీకోసం కొన్ని విషెస్..

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్.. నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి……. శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ – అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీ రాఘవం దేశ దశాత్మజ ప్రమేయం.. సీతాపతిం రఘు కలాస్వయ.. రత్నదీపమ్ రజామబాహుమరవింద దళత్పక్షమ రామం విశాల్ వినాశికరం నమామి.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

శ్రీరామ చంద్ర మూర్తి దయ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. – అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శుద్ధబ్రహ్మ పరాత్పర రామా …..కాలాత్మక పరమేశ్వర రామా ….శేషతల్ప సుఖనిద్రత రామా…… బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా…. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

శ్రీ సీతారాముల వారి అనుగ్రహంతో మీకు సర్వదోషాలు తొలగిపోయి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

పట్టాభిరామునికి ప్రియవందనం .. పాప విదూరునికి జయవందనం… అయోధ్య రామునికి అభివందనం… శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం.. శ్రీరామనవమి.. మీకు ఈ పర్వదినం శుభకరం ఆనందకరం కావాలని ఆశిస్తూ.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

Share this post with your friends
Exit mobile version