Site icon Bhakthi TV

శ్రీ ప్రస‌న్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ‌

అప్పలాయ‌గుంట‌ శ్రీ ప్రస‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీన జ‌రుగ‌నున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. ఉద‌యం ఆచార్య ఋత్విక్‌వ‌ర‌ణం జ‌రిగింది. సాయంత్రం 6.30 నుంచి అంకురార్పణం నిర్వహించారు ఇందులో భాగంగా మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్సవం, అంకురార్పణ చేప‌ట్టారు. జూలై 22వ తేదీ అంటే ఇవాళ ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్రస‌న్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించ‌నున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 2.40 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహరించి విహరించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మివ్వనున్నారు. ఇక అంకురార్పణ కార్యక్రమంలో అప్పలాయ‌గుంట‌ శ్రీ ప్రస‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ఏఈఓ శ్రీ రమేష్, ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version