Site icon Bhakthi TV

విభూతితో చేసే లింగార్చన ఫలం ఎలాంటిది?

శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసే ముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం చేసిన వారికి దక్కుతుందని శాస్త్రం. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందికి జారగానే, అలా అభిషేకం చేసిన వారి పాపాలు హరించుకుపోతాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి, మనస్సు ఈశ్వరాభిముఖ మవుతుంది.

స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని పట్టుకోవడంతో ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు కాబట్టి భస్మం అంత గొప్పది. దానిని ధరించినవాడు పరమశివుని ఆశీర్వచనా బలంతో ప్రకాశిస్తూ ఉంటాడు.

భస్మం ఎలా తయారవుతుందంటే..

భస్మం రెండు రకాలుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం ధరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం.

Share this post with your friends
Exit mobile version