Site icon Bhakthi TV

నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు ఏమేం ఉన్నాయంటే..

ప్రతి నెలా టీటీడీ ఆ నెలలో జరగబోయే విశేష ఉత్సవాల జాబితాను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల కూడా విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.

తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు..

⁠నవంబరు 1న కేదారగౌరీ వ్రతం

నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.

నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర

నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ

నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర

10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం

నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

నవంబరు 12న ప్రబోధన ఏకాదశి

నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి

నవంబరు 15న కార్తీక పౌర్ణమి

28న ధన్వంతరి జయంతి

29న మాస శివరాత్రి

Share this post with your friends
Exit mobile version