Site icon Bhakthi TV

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఎప్పటి నుంచంటే..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలు సెప్టెంబరు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌రు 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ మ‌ధ్యాహ్నం 3 నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనంను అత్యంత వైభవంగానూ.. వేడుకగా నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదే విధంగా సాయంత్రం ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 2వ తేదీ విజయదశమి నాడు శ్రీ పద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంట‌ల‌కు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వంను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదేవిధంగా, సెప్టెంబ‌రు 26న ల‌క్ష్మీపూజ‌ సేవ‌లు రద్ద‌య్యాయి.

Share this post with your friends
Exit mobile version