Site icon Bhakthi TV

“జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?

ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.

హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?
హనుమ బలం హనుమకు తెలియదని అంటారు. దీనికి కారణం మునుల శాపమేనని చెబుతారు. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తితో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది. ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.

“జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?

రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు?
మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో రామకార్యం చేయడంలో హనుమంతుడు ఆత్రుతను కనబరిచాడు.

సీతారాముల పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇచ్చాడు.

Share this post with your friends
Exit mobile version