
అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం స్వామివారి పల్లకీ సేవ జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కర్కాటక లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఇక నిన్న ఉదయం స్వామివారి పల్లకీ సేవ జరుగగా.. రాత్రి హంస వాహన సేవ వైభవంగా జరిగింది.
ఇక ఇవాళ ఉదయం కూడా పల్లకీ సేవ జరిగింది. సాయంత్రం స్వామివారు సింహ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూన ఉదయం 8 గంటలకు.. రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరగనున్నాయి. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో దంపతులకు పాల్గొనేందుకు అవకాశం ఉంది. దంపతలు ఎవరైనా సరే.. రూ.500 చెల్లించి స్వామివారి ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఇక బ్రహ్మోత్సవాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.
