Site icon Bhakthi TV

శివుడే మన తొలి గురువు : పండిట్ రవిశంకర్

గురుపౌర్ణమి సందర్భంగా సద్గురు పండిట్ రవిశంకర్ ఓ సందేశాన్ని ఇచ్చారు. గురువుగా తన పాత్ర ప్రజలకు సాంత్వన కలిగించడం కాదని.. ప్రజల్లోని అత్యున్నత శక్తిని మేల్కొల్పడమని పేర్కొన్నారు. మానవుడి జీవి పరమార్థాన్ని గుర్తు చేయడమే ఆధ్యాత్మిక శాస్త్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వ్యక్తి బతికేందుకు జీవితాంతా కొనసాగించే పోరాటంలోనే జీవిత సారాన్ని తెలుసుకుంటాడని రవి శంకర్ పేర్కొన్నారు. ఆధ్యాత్మికమంటే అర్థం జీవితాన్ని అనుభవించమని.. వదిలేయడం కాదన్నారు. నచ్చిన పని చేస్తూ జీవితాన్ని అనుభవించాలని సూచించారు. ఈ ప్రయాణం అంత సులభమేమీ కాదని.. అందుకే ఇలా బతికేందుకు భయపడుతుంటారని.. ఆ భయాన్ని తొలగించేందుకే గురువు అవసరమని సద్గురు అన్నారు.

నిత్యం తాను చాలా మంది భక్తులతో సత్సంబంధాలు కలిగి ఉంటానని.. వారంతా ప్రకృతితో అనుసంధానమై ఉంటారన్నారు. ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి ప్రాధాన్యమిస్తేనే జీవితంలోని భయాలన్నీ తొలగుతాయన్నారు. భయం అనేది సహజమైన స్థితి కాదని.. అవగాహనలేమి వల్ల కలిగే భావన అని సద్గురు పేర్కొన్నారు. అపరిమితమైన అవగాహన పెంచుకుంటే మనం యథార్థాన్ని గ్రహించగలుగుతామన్నారు. తద్వారా భయం కూడా పోతుందన్నారు. దీని కోసం యోగా శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. శివుడిని యోగిగా చూస్తాం కాబట్టి ఆయనే మన తొలి గురువు అని పేర్కొన్నారు. శివుడు చెప్పిన విధంగా జీవితాన్ని అందంగా మలచుకోవాలన్నారు.

Share this post with your friends
Exit mobile version