Site icon Bhakthi TV

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ‌పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ్టి నుంచి పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే పవిత్రోత్సవాలకు నిన్న సాయంత్రమే శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకూ జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. జూలై 18న ప‌విత్ర ప్రతిష్ఠ, జూలై 19న గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్పణ‌, జూలై 20న మ‌హా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ‌

శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. చివరిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 20న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends
Exit mobile version