Site icon Bhakthi TV

తిరుమలలో వివిధ దర్శనాలు, సేవలకు సంబంధించిన టికెట్ల విడుదల షెడ్యూల్ రిలీజ్..

తిరుమలలో కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఆర్జిత సేవల టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. మూడు నెలల ముందుగానే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. మరి వాటి వివరాలేంటో తెలుసుకుందాం.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు : డిసెంబర్​ నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ ఉదయం విడుదల కానున్నాయి. సెప్టెంబర్​ 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఇవాళ ఉదయం 10 నుంచి ​20వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ముందుగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఖరారు చేస్తుంది.

కల్యాణోత్సవం టికెట్లు : ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటా విడుదల కానుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.

అంగప్రదక్షిణ టోకెన్లు : డిసెంబర్ కోటా అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుదలవుతాయి.

స్పెషల్​ దర్శనం టికెట్లు : సెప్టెంబర్ 24న ఉదయం 11 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) విడుదలవుతాయి. అదే విధంగా.. తిరుపతి, తిరుమలలో గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.

శ్రీవారి సేవ కోటా.. : శ్రీవారి సేవ కోటా టికెట్లు ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా.. న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టోకెన్లు మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. కాబట్టి.. డిసెంబర్ నెలలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version