Site icon Bhakthi TV

రేపే సద్దుల బతుకమ్మ.. తొమ్మిది అంతరులుగా బతుకమ్మను పేర్చి..

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరం ముగింపు దశకు చేరుకుంది. రేపే సద్దుల బతుకమ్మ. ఇన్ని రోజుల పాటు ఊరు, వాడా అంతటా బతుకమ్మ ఆటపాటలతో సందడిగా ఉన్నాయి. బతుకమ్మ సంబరం తెలంగాణ ఎల్లలనే కాదు.. దేశ ఎల్లలనూ దాటింది. బతుకమ్మ పాటలు ఏడాదికి ఒకటి, రెండు పెరుగుతున్నాయి. తెలంగాణ పడుచులు తమ బాధను బతుకమ్మ రూపంలో పాటలు కట్టి పాడుకుంటూ ఉంటారు. బతుకమ్మ పాటు వీనుల విందుగా ఉంటాయి. రేపు చివరి రోజు కాబట్టి బతుకమ్మకు సద్దుల నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ అన్నంతో పాటు రొట్టె, చక్కెర కలిపి చేసే అడ్డూను సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మను ఇతర బతుకమ్మలకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. తొమ్మిది అంతరులుగా చూసేందుకు అద్భుతంగా తయారు చేస్తారు. మహిళలు సైతం ఎంతో అందంగా ముస్తాబై బతుకమ్మ ఆడతారు. మిగిలిన ఎనిమిది రోజులకు.. సద్దుల బతుకమ్మకు చాలా వ్యత్యాసం ఉంటుంది. తొమ్మిది అంతరులుగా బతుకమ్మను పేర్చి ఒకచోటకు తీసుకెళ్లి చీకటి పడే వరకూ ఆడి పాడుతారు. మహిళలంతా తమ బాధలను మరిచి ఆకాశమంతా సంతోషాన్ని తమలో నింపుకుని బతుకమ్మ ఆడుతారు. దానిపై గౌరమ్మను పెట్టి గంగమ్మ ఒడిలో వదిలి పెట్టి మళ్లీ ఏడాది వరకూ బతుకమ్మ కోసం ఎదురు చూస్తారు. గంగమ్మ ఒడికి చేరిన తరువాత అక్కడి నీటి ప్రాంతమంతా పూలతో నిండిపోయి మరింత అందంగా కనిపిస్తుంది.

Share this post with your friends
Exit mobile version