Site icon Bhakthi TV

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన రుద్ర‌యాగం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే స్వామివారి ఆలయంలో 11 రోజులుగా రుద్ర యాగం జరుగుతోంది. శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమా (రుద్ర‌యాగం)నికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ యాగం శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన‌, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.త‌రువాత రాత్రి శ్రీ కాలభైరవ స్వామివారి క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ ఆరాధ‌న‌ నిర్వహించారు. నవంబరు 30న శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో శ్రీమతి గౌతమి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version