Site icon Bhakthi TV

రావణుడి జాతర.. 11 రోజుల పాటు మందు, మాంసం అన్నీ నిషేధం..

దసరా పండుగను దశకంఠుడిని రాముడు సంహరించిన రోజుకు ప్రతీకగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇవాళ రావణ దహన కార్యక్రమాన్ని సైతం యావత్ భారత దేశం నిర్వహిస్తుంది. కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగినన్ని ఆలయాల్లో మాత్రం విభిన్నంగా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే.. ఆ ఆలయాల్లో రావణ బ్రహ్మను దైవంగా కొలుస్తారు. దసరా సమయంలో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే రాముడిని శత్రువులా భావిస్తారు. అది మరెక్కడో కాదు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని కొడిసెలగూడ అనే గ్రామంలో.. ఇక్కడి వారంతా రావణాసురుడిని తమ ఇలవేల్పుగా భావిస్తూ ఉంటారు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా కొడిసెలగూడ గ్రామంలో రావణాసుర జాతర దసరా సమయంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడి గిరిజనులకు రావణాసురుడే ఆరాధ్య దైవం. దసరా నాడు రావణుడికి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు ఇక్కడ రావణాసురుడికి పూజా కార్యక్రమాలు, జాతర నిర్వహిస్తారు. ఈ 11 రోజుల పాటు మాంసం, మద్యపానం, దూమపానం వంటివన్నీ గ్రామంలో నిషేధం. మరో విశేషం ఏంటంటే జమ్మి పూజ నిర్వహిస్తారు కానీ జమ్మి ఆకును మాత్రం తెంపరు. ఇక్కడి నల్లరాతితో చేసిన పది తలల రావణుడి విగ్రహాన్ని చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం.

Share this post with your friends
Exit mobile version