Site icon Bhakthi TV

Ratha Saptami Significance & Rituals : రథసప్తమి రోజున ఈ పనులు తప్పకుండా చేయాలి… ఇలా చేయడం చేస్తే

రథసప్తమి రోజున ఈ పనులు తప్పకుండా చేయాలి, ఇలా చేయడం చేస్తే..! #rathasaptami #ttd #tirumala #trending

రథసప్తమి రోజు సూర్యనారాయణుడి కటాక్షం పొందాలంటే కొన్ని పనులు తప్పకుండా చేయాలని పెద్దలు చెబుతారు. మాఘ శుక్ల సప్తమి నాడు ఉదయించే సూర్యుడిని దర్శించడమే మహాపుణ్యమని విశ్వాసం. తెల్లవారుజామున శుభస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా నిలబడి రాగి పాత్రలో నీరు, అక్షతలు, ఎర్రపువ్వులతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. “ఓం సూర్యాయ నమః” మంత్ర జపం, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేస్తే ఆయురారోగ్యాలు, తేజస్సు పెరుగుతాయి. ఈ రోజున నదీస్నానం, దానం చేస్తే పాపాలు తోలగిపోతాయని నమ్మకం. సూర్యారాధనతో ఉద్యోగం, విద్య, వ్యాపారాల్లో విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రథసప్తమి నాడు సూర్యుడిని భక్తితో ఆరాధిస్తే జీవితం వెలుగుమయం అవుతుందని నమ్మకం.

Ratha Saptami Significance & Rituals
Share this post with your friends
Exit mobile version