
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పుష్కరిణిని నేటి నుంచి మూసివేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ పుష్కరిణిని మూసివేస్తారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణిని శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ పనులను నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటారు. ముఖ్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతు పనులను నిర్వహిస్తూ ఉంటారు. పుష్కరిణిలోని మొత్తం నీటిని తీసివేస్తారు. ఆపై పుష్కరిణిలోని బురదనంతటినీ తొలగించి.. మెట్లను శుభ్రపరుస్తారు.అనంతరం పైపులకు పెయింట్ వేస్తారు. ఈ పనులన్నీ పూర్తవడానికి నెల రోజులు పడుతుంది కాబట్టి ఆ పది రోజుల పాటు నిర్వహిస్తారు.
వాస్తవానికి స్వామివారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. దీనిలో అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. అంతేకాకుండా పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ఈ వ్యవస్థ పని చేస్తుంది. కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేస్తుంది. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ. త్వరలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేసి మరమ్మతులను చేయనున్నారు. మొదటి పది రోజుల పాటు నీటిని తొలగించడం.. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు.. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి సిద్ధం చేస్తారు.
