Site icon Bhakthi TV

శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారికి బోనం సమర్పించిన అర్చకులు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శ్రీశైల మహాక్షేత్రం గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి తాజాగా బోనం సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చకులు అంతా కలిసి అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. ఇది ఈ ఏడాది కాదు.. గత కొంతకాలంగా వస్తున్న ఆనవాయితీ. మూల నక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం దేవస్థానం తరుఫున బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు, వేద పండితులు, ఏఈవో హరిదాసు పలువురు ఆలయ మహాద్వారం నుంచి బోనంతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.

సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటిని అంకాళమ్మ అమ్మవారి కి బోనంగా సమర్పించారు. విశేషంగా పూజాధికాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, జనులందరూ సంతోషంగా ఉండాలని సుఖసంతోషాలు, సంకల్పము పఠించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Share this post with your friends
Exit mobile version