Site icon Bhakthi TV

ఇవాళ శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ..

ఇవాళ శ్రీవారికి గరుడ వాహన సేవ జరుగనుంది. ప్రతి నెలలో ఒకసారి మాత్రమే శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ జరుగుతుంది. కానీ ఆగస్ట్ నెలలో మాత్రం రెండు సార్లు గరుడ వాహన సేవ జరుగనుంది. ఇవాళ గరుడ పంచమి. ఈ సందర్భంగా స్వామివారికి నేడు గరుడ వాహన సేవ జరుగనుంది. నేడు గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ తమ ఇష్ట వాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీవారి వాహనాల్లోనూ.. సేవకుల్లోనూ గరుత్మంతుడు అగ్రగణ్యుడు. శుక్ల పక్షమి ఐదవ రోజున ప్రతి ఏడాది గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా నూతన దంపతులు గరుడ పంచమి పూజను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజ చేయడం వలన వైవాహిక జీవితంతో ఆనందంగా ఉంటుందని నమ్మకం. అలాగే తమకు పుట్టే సంతానం గరుత్మంతుడి వలే బలంగా.. మంచి వ్యక్తిత్వం కలవాడిగానూ ఉంటాడని విశ్వాసం. ఈ క్రమంలోనే ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తూనే ఉంటారు. ఈ నెల మాత్రం రెండు సార్లు వచ్చింది. ఇవాళ మాత్రమే కాకుండా శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్ట్ 19న కూడా గరుడ సేవ నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version