Site icon Bhakthi TV

పోతనామాత్యుడు భాగవతాన్ని ఒంటిమిట్టలోనే అనువదించాడట..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు సైతం శ్రీరామనవమి రోజున ప్రారంభం కానున్నాయి. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన భాగవతం అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీ రామ‌యాణంలోని కాండ‌లపై కవి సమ్మేళనం జరుగుతుంది.

రాములవారిపై సాహిత్యం..

ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతనామాత్యుడు ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట రశరథరామ శతకం చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు.

Share this post with your friends
Exit mobile version