Site icon Bhakthi TV

ఈ ఆలయానికి వెళితే మరణమే.. తిరిగి రావడమే ఉండదట..

ప్రపంచంలో వింతలూ విశేషాలకు నెలవైన ఆలయాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దానికీ మూలం కనిపెట్టిన మనిషి.. ఈ ఆలయాల గుట్టును మాత్రం విప్పలేకపోతున్నాడు. అలాంటి రహస్యాలకు నెలవైన ఆలయం తుర్కియేలో ఉంది. ఈ ఆలయం లోపలికి వెళ్లటమే కానీ తిరిగి రావడమంటూ ఉండదట. అందుకే దీనిని ‘గేట్ టు హెల్’ అంటే నరక ద్వారం అని అంటారు. తుర్కియేలోని పురాతన నగరమైన హిరాపోలిస్‌లో ఉన్న ఈ ఆలయం చిమ్మ చీకటిలో ఉంటుంది. ఇక్కడికి వెళ్లిన వారు సజీవంగా తిరిగొచ్చింది ఇప్పటి వరకూ లేదట.

ఇక్కడికి వెళ్లిన వారు ఆలయంలోని దేవతల కోపానికి బలవుతుంటారని చెబుతారు. 2018లో ఈ రహస్య ఆలయం బయటపడింది. ఈ ఆలయం కొలువైన టర్కీలోని పురాతన నగరం హిరాపోలిస్.. భారతదేశం నుంచి వెళ్ళే పర్యాటకులకు మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి వెళ్ళే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉండేది. పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడికి వెళ్ళేవారట. కానీ ఆ తర్వాత వారి జాడ కనిపించలేదట. కనీసం ఈ ఆలయాన్ని సందర్శించామని చెప్పే వారు కూడా ఎవరూ లేరు. మరో విచిత్రం ఏంటంటే.. ఈ ఆలయం దగ్గరకు వెళ్లిన మనుషులే కాదు.. జంతువులు, పక్షులు ఆ మాటకొస్తే ఏ జీవి అయినా మరణిస్తుందట.

Share this post with your friends
Exit mobile version