Site icon Bhakthi TV

సింహాద్రి అప్పన్న ప్రసాదాన్ని ఒకసారి తింటే ఎప్పటికీ మరిచిపోలేరు..

మహావిష్ణువు లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలసిన పుణ్యక్షేత్రమే సింహాద్రి అప్పన్న ఆలయం. నిత్య చందనదారుడిగా సింహాద్రి అప్పన్న మనకు దర్శనమిస్తుంటారు. ఇక్కడి గిరిప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యమని భక్తులు భావిస్తుంటారు. స్వామివారి సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. మొక్కులు చెల్లించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని వస్తారు. ఇక్కడ ప్రసాదంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన పులిహోర ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇక్కడి ప్రసాదం స్వీకరించిన వారు ఎప్పటికీ ఆ కమ్మదనాన్ని మరచిపోలేరు.

సింహాచలంలో ఈ ప్రసాదాల తయారీకి వైష్ణవ స్వాములతో ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. అన్నదాన సత్రంలోని పైఫ్లోర్లను ప్రసాద తయారీకి కేటాయించారు. అత్యంత నిష్ట, నిబద్ధతలతో దిట్టం ప్రకారం ప్రసాద తయారీ జరుగుతుంది. అంత నిష్టగా.. నిబద్దతగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ ప్రసాదం అంత అద్బుతంగా ఉంటుంది. సింహాచలం దర్శనానికి వెళ్లి వచ్చారని తెలిస్తే అక్కడి వారిని పులిహోర ప్రసాదాన్ని తప్పక అడుగుతారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే చాలా విశిష్టమైనదని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version