Site icon Bhakthi TV

పూరీ జగన్నాథుడి మహా ప్రసాదంపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

పూరీ జగన్నాథ ఆలయంలోని మహాప్రసాదం విషయమై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రసాదాన్ని స్వామివారి భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని యోచిస్తోంది. ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ మహా ప్రసాదంపై స్పందించారు. పవిత్ర ఒడియా కార్తీక మాసం తరువాత భక్తులకు ఉచితంగా మహా ప్రసాదం పంపిణీ చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇలా మహా ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.14 నుంచి 15 కోట్ల అదనపు భారం పడనుందని చెప్పారు.

అయితే ఈ విషయంలో కొంత మంది భక్తుల నుంచి ఆర్థిక సహకారం కోరనున్నట్టు పృధ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. జగన్నాథుని ఆలయంలో దర్శనం తరువాత భక్తులు ఇంటికి తిరిగి వెళ్లేప్పుడు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు మహాప్రసాదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మహాప్రసాదం పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు భక్తులు ముందుకు రావాలని కోరారు.

Share this post with your friends
Exit mobile version