మేడారం జాతర అంటే భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక ఉత్సాహం… కానీ అమ్మవార్ల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తేనే ఆ ఆనందం పూర్తి స్థాయిలో నిలుస్తుంది. సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటే శుభాలు జరుగుతాయని విశ్వాసం ఉన్నా, నిర్లక్ష్యం మాత్రం ప్రమాదాలకు దారి తీస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండే జాతరలో బంగారు ఆభరణాలు ధరించకుండా, ఫోన్లు–పర్సులు జాగ్రత్తగా చూసుకోవాలి. జంపన్నవాగులో స్నానం చేసేప్పుడు పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్నారుల చేయి ఒక్క క్షణం కూడా వదలకండి. కుటుంబమంతా ఒకే బృందంగా కదలండి. వాహనాలు నెమ్మదిగా నడపండి, మద్యం దరిచేరనివ్వకండి. అమ్మవార్ల అనుగ్రహంతో జాతరకు వెళ్లినంత సురక్షితంగా తిరిగి రావడమే నిజమైన మొక్కు.

