
భాద్రపద బహుళ పాడ్యమి అంటే నిన్నటి (సెప్టెంబర్ 8, 2025) నుంచి మహాలయ పక్షం (పితృపక్షం) ప్రారంభమైంది. ఈ మహాలయ పక్షం సెప్టెంబర్ 21, 2025 వరకూ కొనసాగుతుంది. ఈ పదిహేను రోజులు పూర్తిగా పితృదేవతల పూజలను నిర్వహిస్తారు.
పితృదోషం అంటే ఏమిటి?
పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన సంతతి వారు కష్టాలు అనుభవిస్తారు. జాతక చక్రంలో పితృదోషాలను గుర్తించవచ్చు.
పితృ దోషాలను ఎలా గుర్తించవచ్చంటే..
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు
స్త్రీలకు అకాల విధవత్వం
మానసిక సమస్యలు
సంతానం వల్ల కష్టాలు
పితృఋణం తీర్చడం ఎందుకు అవసరం?
ప్రతి మనిషి తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన: పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. వంశస్థులు సుఖసంతోషాలతో జీవిస్తారు.
