Site icon Bhakthi TV

వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

ఇవాళ అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం… సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం భక్త జనమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. అక్కడ నుంచి భక్తులంతా బోనం సమర్పించడం ప్రారంభించారు. ఇవాళ తెల్లవారు జాము నుంచే లష్కర్ బోనాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొచ్చి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సికింద్రాబాద్ వీధులన్నీ లష్కర్ బోనాల సందర్భంగా శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. సికింద్రాబాద్ మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి బోనాలకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారి దయతో ఆరోగ్యంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. పంటలు బాగా పండాలని రైతులు కోరుకుంటున్నారు. ఇక రేపు రంగం కార్యక్రమం జరుగనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు.

Share this post with your friends
Exit mobile version