Site icon Bhakthi TV

సూతక సమయం గర్భిణులు, పిల్లలకు వేరు.. వారికెప్పుడంటే..

ఇవాళ పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా కలిసి రావడంతో ఈ రోజు (సెప్టెంబర్ 7)కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింద. ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1:26 గంటలకు ముగయనుంది. ఈ గ్రహణం మూడున్నర గంటల పాటు ఉండనుంది. అంటే అత్యంత పొడవైన చంద్రగ్రహణం ఏర్పడనుందన్నమాట. భారత్‌లోనూ ఈ గ్రహణ కనిపించనుండటంతో సూతక కాలం పాటించి తీరాల్సిదే. సూతక కాలం 9 గంటల ముందు అంటే మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభం కానుందని జోతిష్య పండితులు చెబుతున్నారు. మరి సతక కాలంలో పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సూతక కాలం ప్రారంభానికి ముందే.. అంటే 12:57 గంటలకు ముందే అవసరమైన పనులన్నింటినీ పూర్తి చేసుకోవాలని పండతులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సూతక కాలం ప్రారంభానికి ముందు పూజ, జపం, ధ్యానం నిర్వహించకూడదట. పితదేవతలకు తర్పణం అర్పించాల్సిన వారు.. ఉదయాన్నే ఈ పనులు పూర్తి చేసుకోవాలి. అయితే గర్భిణులకు, పిల్లలు, వృద్ధులకు మా్రం సూతక సమయం వేరుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వారికి సూతక ప్రభావం ఇవాళ సాయంత్రం 6:35 గంటల నుంచి ఉండనుంది. చంద్రగ్రహణం ముగిసిన సమయంలోనే సూతక ప్రభావం కూడా ముగుస్తుంది. ఇక చంద్రగ్రహణం తర్వాత తమ శక్తి మేరకు దుస్తులు, వస్తువులను దానం చేస్తే మంచిదట. అలాగే బియ్యం, పాలు, చెక్కెర, నువ్వులు, నెయ్యి, వెండి చంద్రవంక వంటి వాటిని దానం చేయాలి.

Share this post with your friends
Exit mobile version