Site icon Bhakthi TV

సర్పం పొలుసులతో సుబ్రహ్మణ్య స్వామి.. ఎక్కడంటే..

కొన్ని ఆలయాలు వాటి ప్రత్యేకత కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. పుట్టలో నుంచి ఇక్కడ శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లభించిందట. ఈ ఆలయ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? ఆ క్షేత్ర ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి 13 కి.మీ దూరంలో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఇక్కడి క్షేత్రంలో వెలిసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి మూర్తి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.

ఈ ఆలయంలో ఒక చెరువు ఉంటుంది. చాలాకాలం కిందట ఆ చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. ఆ పాము తేజస్సు చాలా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా.. చూడగానే ఒక పవిత్రమైన భావన కలగడంతో ఎవరూ దానికి హాని తలపెట్టలేదట. కాలక్రమేణా చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోవడంతో పాము విషయాన్ని కూడా అంతా మరిచిపోయారు. ఒకరోజు చెరువుకు మరమ్మత్తులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడిందట. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో.. స్వామివారి దేహం సర్పం పొలుసులతో కూడి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version