Site icon Bhakthi TV

తన సాన్నిధ్యాన్ని చేరే మార్గం చెప్పిన శివుడు

అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం తాగితే సకల రోగాలు నయమవుతాయని జనం చెప్పుకునేవారు. ప్రతిరోజూ ఆయన చేతి మీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు పక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు వస్తుండేవారు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. పరమేశ్వరుడిని “స్వామీ.. ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా?” అని అడిగాడు. శివుడు నవ్వి.. ‘దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉంది’ అని తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు.

‘ఇదిగో.. ఈ మట్టి పాత్రను చూసావు కదా.. ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి” అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట “ఇదేదో అద్భుతమైన కల”అనుకున్నాడు గానీ.. ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర శంకరశాస్త్రికి కనిపించింది. ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూశాడు. అది రంగు మారలేదు. అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. “నేను ఇంకా పుణ్యం‌ సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను” అనుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version