Site icon Bhakthi TV

పరమేశ్వరుడికి ద్వారపాలకుడిగా శనీశ్వరుడు..

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో రెండు నదుల మధ్య తిరునల్లార్ శని దేవాలయం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఇది పేరుకే శని దేవాలయం కానీ ఇక్కడ శివుడు కూడా కొలువై ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఆసక్తికర విషయం ఏంటంటే.. పరమేశ్వరుడికి శనీశ్వరుడు ఈ ఆలయంలో ద్వారపాలకుడిగా ఉంటాడు. ఈ ఆలయానికి వెల్లిన భక్తులకు శని కష్టాల నుంచి పరమేశ్వరుడు విముక్తి కలిగిస్తాడట. అందుకే ఈ ఆలయానికి వెళ్లిన వారికి శని కష్టాలు ఉండవట.

ఇక్కడ పరమ శివుడు ప్రధాన దైవం అయినప్పటికినీ ఆలయంలోని ‘నల పుష్కరిణి’లో స్నానం చేసి ముందుగా శనిదేవుని దర్శించుకోవాలి. ఆ తరువాత మాత్రమే శివ పార్వతులను దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఆలయాన్ని దర్శించిన భక్తులు ముందుగా ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. పూజ పూర్తైన తర్వాత కాకులకు అన్నం పెడతారు. ఈ ఆలయం నిత్యం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఇక మహాశివరాత్రి, కార్తికపౌర్ణమి వంటి పర్వదినాల్లో అయితే పెద్ద ఎత్తున ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు.

Share this post with your friends
Exit mobile version