Site icon Bhakthi TV

గోవిందమ్మ నిర్మలమైన భక్తికి దాసోహమైన శ్రీకృష్ణుడు

గోవిందమ్మకు జైలు శిక్ష విధించారు. కారాగారంలోకి వెళుతూ యథావిధిగా కృష్ణార్పణం అనేసింది. అప్పుడేం జరిగిందో తెలుసుకుందాం. మరుసటి రోజు ఆలయంలోని శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారిపోయి తనకు భక్తులు పూజలు చేయవద్దని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. అయినా కూడా ఊరి వాళ్లు పూజలు నిర్వహించారు. గోవిందమ్మ కారాగారంలో నేలపై పడుకుని కృష్ణార్పణం అనుకుంది. అంతే మరుసటి రోజు చూస్తే ఆలయంలోని కృష్ణుడి విగ్రహం కూడా నేలపై పడుకుని ఉంది. పూజలు చేయవద్దని చెప్పినా మరుసటి రోజు చేయడంతో మూడో రోజు ఆలయ గర్భగుడి ద్వారాలు ఎంత తీసినా కూడా తెరుచుకోలేదు.

మరోవైపు జైలులో ఉన్న గోవిందమ్మ కాలికి ఏదో తగలడంతో బొటనవేలు నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది. ఆమె అలవాటుగా కృష్ణార్ఫణం అనడంతో అది మాయమవడానికి అక్కడి భటులు చూశారు. వెళ్లి రాజుగారికి విషయం చెప్పారు. రాజుగారికి విషయం అంతుబట్టలేదు. గోవిందమ్మను పిలిపించి గాయం ఎలా మానిందని అడిగారు. తనకు తెలియదని చెప్పింది. అప్పుడు రాజుగారు ‘నువ్వు గాయమైనప్పుడు ఏదో మంత్రం చెప్పావట కదా.. అదేంటి?’ అని అడిగారు. ఆమె కృష్ణార్పణం అన్నానని బదులిచ్చింది. సభలోని వారంతా షాక్ అయ్యారు.

‘దాని అర్థం నీకు తెలుసా?’ అని రాజుగారు ప్రశ్నించారు. దీంతో ఆమె తను జపించకూడని మంత్రమేదో జపించానని భావించి ఏడుస్తూ క్షమాపణ కోరుకుంది. అప్పుడు ఆ అమాయకురాలికి కృష్ణార్పణం అర్థమేంటో వివరించారు. అలాగే ఆమె నిర్మల భక్తికి కన్నయ్య ఎలా దాసోహమయ్యాడో కూడా తెలుసుకున్నారు. గోవిందమ్మ కాళ్లపై పడి క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు కానీ ఆమెకు కృష్ణార్పణం అనడం వల్ల తను చేసిన పనుల వల్ల కృష్ణుడిపై చెత్త పడటం, గాయమవడం జరిగిందని తెలిసి రోదిస్తూ ఆలయానికి వెళ్లింది. అక్కడ కన్నయ్య సంతోషంగా కనిపించడంతో కర్తవ్యం బోధపడింది. అప్పటి నుంచి వను తినడానికి ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. ఆ వెంటనే కన్నయ్య కూడా తృప్తిగా భోజనం చేసేవాడు.

Share this post with your friends
Exit mobile version