Site icon Bhakthi TV

శ్రీకృష్ణుడిని కలిసి అసలు విషయం చెప్పడం మరిచిన కుచేలుడు

శ్రీకృష్ణుడు, కుచేలుని పరిచయం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత కుచేలుని వివాహం.. బహు సంతానంతో మరింత దారిద్ర్యంలోకి కూరుకుపోవడం గురించి కూడా చెప్పుకున్నాం. ఈ దారిద్ర్యం కారణంగా పిల్లలకు సరిగా భోజనం కూడా పెట్టలేకోతుంటారు. అలాంటి తరుణంలో కుచేలుని భార్య ఓరోజు శ్రీకృష్ణుడు గొప్ప ప్రభువు.. పైగా ఐశ్వర్యవంతుడు.. అంతేకాకుండా మీకు మంచి మిత్రుడు కాబట్టి ఒకసారి ఆయనను కలిసి మన కష్టాల గురించి వివరించడని చెప్పింది. శ్రీకృష్ణుడు తప్పక సాయమందిస్తాడని.. దీంతో దారిద్ర్యం నుంచి బయట పడతామని తెలిపింది. అది సరైనదే అనుకున్న కుచేలుడు.. శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.

మరి వట్టి చేతులతో వెళ్లడమెలా? అని కుచేలుడు ఆలోచిస్తుండగా.. అతని భార్య కొన్ని అటుకులను మూటగట్టి ఇస్తుంది. కుచేలుడు తన బాల్య మిత్రుడిని కలుసుకోబోతున్నాననే ఆనందంతో ద్వారకకు చేరుకుంటాడు. కానీ అక్కడకు చేరుకున్నాక ఆ రాజప్రాసాదాలను చూసి తన అవతారం చూసుకుని తనను రాజభటులు లోపలికి అనుమతిస్తారో లేదోనన్న సందేహంతోనే అక్కడకు వెళతాడు. కుచేలుడిని దూరం నుంచి చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున ఎదురొచ్చి మరీ అప్యాయంగా గుండెలకు హత్తుకుని లోపలికి తీసుకెళతాడు. కుచేలునికి శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవితో కలిసి పాద పూజ చేస్తాడు. మంచి చెడూ కనుక్కుంటాడు. ఇద్దరూ చిన్ననాటి కబుర్లన్నీ చెప్పుకుంటారు. అటుకులను శ్రీకృష్ణుడు బహుమతిగా అందజేసి.. వచ్చిన విషయం మరిచి ఆనందంగా తిరుగు పయనమవుతాడు.

Share this post with your friends
Exit mobile version