Site icon Bhakthi TV

15న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 19 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

19-02-2025

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం

20-02-2025

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

21-02-2025

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

22-02-2025

ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

23-02-2025

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

24-02-2025

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

25-02-2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

26-02-2025

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

27-02-2025

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

28-02-2025

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

Share this post with your friends
Exit mobile version