Site icon Bhakthi TV

కన్వర్ యాత్ర ప్రారంభం.. శివయ్యపై భక్తితో..

భోళా శంకరుడు.. అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లతో అభిషేకించినా పొంగిపోయి వరాలు ఇస్తాడు. హిందువులంతా తీర్థ యాత్రలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏదో స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి మరీ వెళతారు. ఆ భగవంతుని రూపాన్ని కళ్లతో తనివితీరా చూసి గుండెల్లో నింపుకుని తిరిగి వస్తారు. అలా దైవదర్శనం చేసే ఒక కఠినమైన యాత్రే కన్వర్ యాత్ర. భోళా శంకరుడి అనుగ్రహం కోసం భుజాన కావిళ్లతో గంగాజలాన్ని మోసుకుంటూ వందల కిలో మీటర్ల దూరం నడిచి వెళతారు.

ఆలయానికి చేరుకోగానే శివయ్యను తీసనుకొచ్చిన నీటితో అభిషేకించి మొక్కులు తీర్చుకుంటారు. హిందూ సంప్రదాయంలో అన్ని మాసాల్లోకి అత్యంత విశిష్టత కలిగిన మాసాల్లో శ్రావణం ముందుంటుంది. ఈ మాసంలో అనేక వ్రతాలను మనం జరుపుకుంటాం. ఇక ఉత్తరాదిన మాసంలో శివయ్య ఆరాధనకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. చాంద్రమాసం ప్రకారం అయితే ప్రతి నెలా పౌర్ణమి నుంచి కొత్త మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆషాడ పౌర్ణమి నేటి నుంచి ప్రారంభమైంది. ఇక ఈ శ్రావణ మాసం ఆగస్ట్ 9న ముగియనుంది. ఈ మాసంలో గంగానది నుంచి కావిళ్లతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతంలోని శివలింగానికి జలాభిషేకం చేస్తారు.

Share this post with your friends
Exit mobile version