Site icon Bhakthi TV

పాల వ్యాపారికి కలలో కనిపించిన తానెక్కడున్నాడో చెప్పిన కన్నయ్య

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని సన్వాలియా సేథ్ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుడికి వచ్చిన కానుకలతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆలయ నిర్వాహకులు రెండు నెలలకు సంబంధించిన ట్రెజరీ గణన నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.23 కోట్ల నగదు, 1 కిలోల బరువున్న బంగారు బిస్కెట్‌తో పాటు చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలతో పాటు ఇంకా అనేక విలువైన వస్తువులను భక్తులకు సమర్పించడం జరిగింది. చిత్తోర్‌గఢ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్‌గఢ్-ఉదయ్‌పూర్ హైవేపై ఉన్న సన్వాలియా సేఠ్ ఆలయం వైష్ణవ భక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర కథ ఉంది. 1840లో భోలారం గుర్జార్ అనే పాల వ్యాపారికి కలలో శ్రీకృష్ణుడు కనిపించాడట. భూమిలో ఉన్న కృష్ణుడి విగ్రహాల గురించి చెప్పాడట. దీంతో సదరు పాల వ్యాపారి కలలో కనిపించిన ప్రాంతాల్లో త్రవ్వకాలు జరపగా మండఫియా, భద్సోడా చాపర్‌లలో ప్రతిష్టించబడిన మూడు విగ్రహాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ మూడు ఆలయాలకు మండఫియా ఆలయం కేంద్రంగా ఉంది. దీనిని శ్రీ సన్వాలియా ధామ్ అని పిలుస్తారు. క్రమక్రమంగా ఈ ఆలయం అత్యంత పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది.

Share this post with your friends
Exit mobile version