Site icon Bhakthi TV

కైశిక ద్వాదశి పురాణ ప్రాశస్త్యం ఏంటంటే..

శ్రీమహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళతారని తెలుసుకున్నాం కదా.. కైశిక ద్వాదశి నాడు ఆయనను మేల్కొల్పుతారు. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి మహోత్సవాన్ని నిర్వహిస్తారు. పురాణాల ప్ర‌కారం శ్రీ‌ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ ద్వాద‌శి కూడా ఒక‌టి. శ్రీ వ‌రాహ స్వామి కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాన ద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

Share this post with your friends
Exit mobile version