Site icon Bhakthi TV

జగన్నాథుడికి జ్వరం వచ్చినన్ని రోజులు రోజుకొక వైద్యుడి పర్యవేక్షణ..

పూరి జగన్నాథుడికి జ్వరం వచ్చిదని తెలుసుకున్నాం కదా. జగన్నాథుడికి వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటిని తీసుకొచ్చి సంప్రదాయబద్దంగా స్నానం చేయిస్తారు. ఆ తరువాత జగన్నాథుడికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురయ్యాడని చెబుతారు. ఈ క్రమంలోనే ఆలయ తలుపులు మూసివేసి 15 రోజుల పాటు జగన్నాథుడికి గోప్యంగా చికిత్సనందిస్తారు. ఈ ఏకాంత సేవకు ఎవరు పడితే వారు వెళ్లరు. కేవలం దయిత్గన్ అని పిలవబడే వ్యక్తిగత సహాయకులు మాత్రమే స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.

పూరి జగన్నాథుడు అస్వస్థతకు గురైన సమయంలో 24 గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది సైతం ఆయన అస్వస్థతకు గురైన 15 రోజుల పాటు మూసివేయబడుతుంది. ఈ 15 రోజుల పాటు స్వామివారు వివిధ రకాల కషాయాలు, మూలికలు మినహా.. ఆహారం అనేది అందివ్వరు. ఇది మాత్రమే కాదు ఈ 15 రోజుల పాటు జగన్నాథుడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రతిరోజూ ఒక వైద్యుడు వెళ్తాడు. అయితే ప్రతి సంవత్సరం 15 రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు? కేవలం నీటితో స్నానమేనా? మరో కారణమేదైనా ఉందా? అంటే తప్పకుండా ఉంది. ఒకటి కాదు. దీనికి రెండు కారణాలున్నాయి. అవేంటో తదుపరి కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version