Site icon Bhakthi TV

కుబురుడి అప్పు తీర్చలేక దిగులుతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడకు వచ్చాడట..

తెలంగాణలోని జనగామ జిల్లాలోని చిల్పూరు గుట్టలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మన ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా చెబుతారు. అందుకే చిల్పూరు గుట్ట వేంకటేశ్వర స్వామిని “అప్పులు తీర్చే వెంకటేశ్వరుడు” లేదా “బుగులు వెంకటేశ్వర స్వామి”గా పిలుస్తారని తెలుసుకున్నాం కదా. అసలు స్వామివారిని గుబులు వేంకటేశ్వరస్వామిగా ఎందుకు పిలుస్తారో ముందుగా తెలుసుకుందాం. దీనికి ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది. పద్మావతి అమ్మవారిని కల్యాణం చేసుకోవడం కోసం కుబేరుడి నుంచి వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నారన్న కథ గురించి హిందువులందరికీ తెలిసిందే.

కుబేరుని నుంచి తీసుకున్న అప్పును తీర్చలేక దిగులుతో శ్రీ వేంకటేశ్వర స్వామివారు.. ఈ చిల్పూరు గుట్టకు వచ్చి ఒక గుహలో తపస్సు చేశారని చెబుతారు. అందుకే ఇక్కడ వెలసిన స్వామిని “బుగులు వెంకటేశ్వరుడు” అని పిలుస్తారు. బుగులు అంటే దిగులు లేదా చింత అని అర్థం. స్వామివారు చిల్పూరు గుట్టకు వస్తున్న సమయంలో స్వామివారి పాదాల గుర్తులు కొండ కింద భాగంలో ఏర్పడ్డాయని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని “పాదాల గుండు” అని పిలుస్తారు. స్వామివారు ఇక్కడకు అప్పుడు బాధల నుంచి బయటపడేందుకు వచ్చారు కాబట్టి వారంతా ఇక్కడికి వచ్చిన వారు కూడా రుణ బాధల నుంచి గట్టెక్కుతారని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version