Site icon Bhakthi TV

ఈ ఆలయంలో శివుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తాడట..

చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు.. పొంగిపోయి కోరిన వరాలిచ్చే భోళాశంకరుడికి ఆలయాలు దేశమంతా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ తప్పనిసరిగా శివాలయం ఉంటుంది. పంచభూత లింగాలు, పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు పేరిట శివాలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. అయితే కర్కట రూపంలో శివయ్య ఎక్కడ దర్శనమిస్తున్నాడో తెలుసా? ఆ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. చుట్టూ పచ్చిక బయళ్లు, ఆపై జలజల పారే సెలయేళ్లు, మధ్యలో ఆలయం. చూడటానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది.

కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో ఓ శివాలయం ఉంటుంది. ఇక్కడి శివుడిని గుండాల ఈశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ శివయ్య చాలా ఆసక్తికర రీతిలో దర్శనమిస్తాడు. ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడట. చిట్వేలి మండలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాల కోన ఉంది. గుండాలకోనలోకి సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుంది. ఈ గుండాల కోనలో వర్షాకాలంలోనే కాకుండా.. వేసవికాలంలో కూడా నీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.

Share this post with your friends
Exit mobile version