Site icon Bhakthi TV

ఈ అమ్మవారిని శ్రీరాముడు దర్శించుకున్నాడట..

మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఒక చిన్న గ్రామమైన కల్వాన్ తాలూకాలోని నండూరిలో సప్తశృంగి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన దేవతను వివిధ పేర్లతో పిలుస్తారు. సప్తశృంగి, సప్తశృంగ-నివాసిని, సప్తశృంగ-మాత, బ్రహ్మ స్వరూపిణి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. సప్తశృంగి దేవత ఎలా ఉద్భవించిందనే దానికి ఓ కథ ఉంది. సృష్టికర్త బ్రహ్మ దేవుని కమండలం నుంచి సప్తశృంగి దేవత ఉద్భవించిందని తెలుస్తోంది. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన విషయం తెలిసిందే. సంహారం తరువాత దుర్గమ్మే ఇక్కడ కొలువైందని నమ్ముతారు.

ఈ ఆలయ పురాణ ప్రాశస్త్యం ఏమిటంటే.. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు యుద్ధభూమిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు హనుమంతుడిని బతికించాలంటే సంజీవని పర్వతంపై ఉన్న మూలికలు కావాలని చెబుతారు. దానికోసం రాములవారు హనుమంతుడిని పంపిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ఔషధ మూలికలను వెతుకుతూ సప్తశృంగి కొండలకు వచ్చాడట. రామాయణంలో ప్రస్తావించిన దండకారణ్యంలో సప్తశృంగి పర్వతం కూడా ఒక భాగమని చెబుతారు. అంతేకాకుండా రాముల వారు సైతం తమ వనవాసం సమయంలో సీత, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి సప్తశృంగి దేవతను దర్శించుకున్నట్టుగా రామాయణం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version