Site icon Bhakthi TV

ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు.. తప్పక సంతాన భాగ్యం కలుగుతుందట..

ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనకు తెలిసిందే. 12 శివుని జ్యోతిర్లింగాలలో ఒక లింగం సంతానం కోరుకునే జంటలకు సంతానాన్ని వరంగా ప్రసాదిస్తుందట. మరి ఆ జ్యోతిర్లింగం ఎక్కడుందో తెలుసుకుందాం. మహారాష్ట్ర దౌలతాబాద్‌లోని బరైల్ గ్రామంలో ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి శివయ్య సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. ఈ శివాలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇక్కడికి మహిళలు ఖాళీ ఒడితో వస్తారు.

ఈ ఘృష్ణేశ్వరుడిని దర్శించుకుంటే చాలు.. కొంతకాలానికే వారి ఒడి సంతానంతో నిండిపోతుందని నమ్మకం. అసలు ఈ ఆలయానికి.. సంతానానికి ఏంటి సంబంధం అంటారా? శివునికి సంబంధించిన ఎన్నో కథలు ఈ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ శివుడు తన భక్తుడి కుమారుడికి ప్రాణం పోశాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ శివాలయానికి వస్తే చాలు.. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఆసక్తికరంగా ఈ ఆలయం ఓ భక్తురాలి పేరు మీదుగా ప్రసిద్ధిగాంచింది. ఆ భక్తురాలి పేరు ఘృష్ణేశ్వర అని చెబుతారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలకు కొంచెం దూరంలో ఉంది.

Share this post with your friends
Exit mobile version