Site icon Bhakthi TV

ఇక్కడ నాగుల చీర, ముడుపు కడితే సంతాన భాగ్యం కలుగుతుందట..

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం నుంచి 13 కి.మీ దూరంలో అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉంటుందని తెలుసుకున్నాం కదా. అత్రి మహర్షి పేరు మీదుగా ఈ అత్తిలి పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్టి నాడు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. ఇక్కడి సుబ్రహ్మణ్యస్వామి అభిషేక ప్రియుడట. అభిషేకం నిర్వహిస్తే భక్తుడి ఎంతటి కోరికను అయినా తీరుస్తాడట. ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.

ఇక్కడ స్వామివారిని సంతానం లేని వారు పూజిస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. సంతానం లేని వారు నాగుల చీర, ముడుపులు కడతారు. సంతానం కలిగిన తర్వాత తలనీలాలు సమర్పిస్తారు. అలాగే పటికబెల్లం తూకం వేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే నాగ, కుజ దోషాలు ఉన్నవారు సైతం ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారని నమ్మకం. ఈ ఉమా సిద్ధేశ్వర ఆలయంలోని మూలవిరాట్టును అత్రి మహర్షి ఆరాధించాడని చెబుతారు. ఇక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్టిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంది.

Share this post with your friends
Exit mobile version