Site icon Bhakthi TV

పక్షవాతం వచ్చినవారు ఈ ఆలయానికి వెళితే.. తగ్గిపోతుందట..

రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఉన్న దుర్గాదేవి స్వరూపమైన ఇడాన మాత ఆలయంలో అత్ని ప్రమాదం సంభవించిన వెంటనే అమ్మవారి ఆభరణాలన్నింటినీ తొలగిస్తారు. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత ఆలయమంతా శుభ్రపరిచి తిరిగి అమ్మవారిని అలంకరిస్తారు. ఇడాన్ మాతను వ్యాధులను నయంచేసే దేవతగా చెబుతారు. ముఖ్యంగా పక్షవాతం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నయమవుతుందట.

సంప్రదాయాలు- ఆచారాలు ఆలయంలో అగ్ని ఉద్భవించినప్పుడు.. ఆలయ పూజారులు ముందుగా అమ్మవారి ఆభరణాలను తొలగిస్తారు. అగ్ని ఆరిన తర్వాత.. విగ్రహాన్ని తిరిగి అలంకరిస్తారు. ఈ అగ్ని స్నానాన్ని చూడటం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని మొక్కుకున్న మీదట కోరికలు నెరవేరితే త్రిశూలాన్ని కానుకగా సమర్పిస్తారు. ఈ ఆలయం పాండవుల నాటిదని నమ్మకం. ఇక్కడ కొన్ని సార్లు నెలకు రెండు సార్లు కూడా అమ్మవారు అగ్ని స్నానం చేస్తుందట. ఆ సమయంలో అక్కడున్న వారి పాపాలను, బాధలను దహించి వేస్తుందని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version