Site icon Bhakthi TV

ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామన్నా సాధ్యం కాలేదట..

తుర్కియేలోని పురాతన నగరమైన హిరాపోలిస్‌లో ఉన్న ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయానికి వెళితే తిరిగి రావడమే ఉండదు. దీనిని నరక ద్వారం అని కూడా పిలుస్తారు. అలాగే ఫ్లూటో ఆలయమని.. మృత్యుదేవత ఆలయమని పిలుస్తారు. మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకు వెళ్లడమే మానేశారు. ఇక పర్యాటకులను సైతం అటువైపు వెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమంతిచడం లేదు. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామని ఎంతమంది శాస్త్రవేత్తలు యత్నించినా కూడా సాధ్యం కాలేదట.

రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ప్లూటో భూమి కింద నివసిస్తున్నాడని చెబుతారు. కొంతమంది మాత్రం ఇదంతా కల్పితమని కొట్టి పడేస్తారు. ఈ ఆలయ రహస్యం 2018లో బయల్పడింది. పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో ఈ ఆలయంపై పరిశోధన చేశారట. ఆయన కూడా ఆలయంలోకి ఎవరూ వెళ్లినా తిరిగి రారని ధృవీకరించారట. పరీక్ష కోసం స్ట్రాబో ఆలయంలోకి ఒక పక్షిని పంపగా అది కాసేపటికే చనిపోయిందట. దీనికి కారణం గుహలో 91 శాతం ఉన్న కార్బన్ డయాక్సైడేనని స్ట్రాబో తెలిపారు. ఈ ప్రదేశంలో ఒకప్పుడు బలులు అర్పించేవారని చెబుతారు. అందుకే ఇక్కడి తవ్వకాల్లో జంతువులు, పక్షుల అస్థిపంజరాలు బయటపడ్డాయట.

Share this post with your friends
Exit mobile version