Site icon Bhakthi TV

తెగిన మొండెంతో ఉంటానని దక్షుడికి శివుడు ఇక్కడే మాటిచ్చాడట..

ప్రపంచంలో తొలి వివాహం ఎక్కడ జరిగింది? ఎవరెవరికి జరిగింది? అనే విషయాలను తెలుసుకున్నాం. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ ప్రాంతంలో పురాతన నగరమైన కంఖాల్‌లో దక్షేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయంలో తొలి వివాహం జరిగిందట. విశ్వంలోనే తొలి వివాహం శివపార్వతులదేనట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సిద్ధ పీఠం 1000 కిలోమీటర్ల విస్తీర్ణం తీర్థయాత్ర నగరంగా పిలువబడుతోంది. ఇక్క ముఖ్యంగా శ్రావణ మాసంలో శివుడు నివసిస్తూ ఉంటాడట. కంఖల్ అనేది సతీదేవి జన్మస్థలమని కూడా కొందరు చెబుతుంటారు.

తెగిన మొండెంతో తాను ఇక్కడ నివసిస్తానని పరమేశ్వరుడు తన మామ అయిన దక్షునికి వరం ఇచ్చాడట. తనను ఈ ఆలయంలో దక్షుడి పేరును సైతం కలిపి పిలుస్తారని చెప్పాడట. దీంతో ఇక్కడి శివయ్యను దక్షేశ్వరుడని పిలుస్తారు. సతీదేవి లేని లోటును తీర్చడానికి శ్రావణ మాసంలో శివుడు ఇక్కడ కొలువై ఉంటాడని నమ్మకం. మరో విశేషం ఏంటంటే.. శివయ్య తలపై చంద్రుడు, గంగ ఉంటారని తెలుసు కదా.. ఆ రెండింటినీ శివుడు ఇక్కడే ధరించాడని అక్కడి వారు చెబుతుంటారు. ఇక్కడి శివయ్యను సోమవారం రోజున గంగా జలంతో అభిషేకిస్తే విశేష ఫలితాలు ఉంటాయట. అందుకే శివుడికి జలాభిషేకం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

Share this post with your friends
Exit mobile version