Site icon Bhakthi TV

వలీ మాతాజీ ఆలయంలో శక్తి నీటిదా? అమ్మవారిదా?

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో కొలువైన గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయ విచిత్రం గురించి తెలుసుకున్నాం కదా. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ నీటితో దీపాలు వెలగడం అనేది ఆసక్తికరం. అయితే ఆ శక్తి నీటిదా? అమ్మవారిదా? అంటే సాక్షాత్తు అమ్మవారిదేనని అక్కడి వారు చెబుతారు. ఈ ఆలయంలో దీపం వెలిగించేందుకు కలిసింధ్ నది నుంచి వచ్చే ఒక ప్రత్యేక రకమైన నీటిని ఉపయోగిస్తారట. తొలుత నీటిని తీసుకొచ్చి దీపంలో పోయగానే అది కొంత సమయం తర్వాత జిగటగా మారిపోతుందట.

ఆ తరువాత నుంచి దీపం వెలుగుతుందట. మరి ఈ నీటితో ఎక్కడైనా దీపాలు వెలిగించవచ్చా? అంటే సాధ్యం కాని విషయమట. ఈ ఆలయంలో మాత్రమే వెలుగుతాయట. అసలు నీటితో దీపాలు వెలగడమేంటన్న సందేహం శాస్త్రవేత్తలకు సైతం వచ్చింది. దీనిపై పరిశోధనలు కూడా చేశారు. ఎన్నోసార్లు ఆలయాన్ని సందర్శించి రకరకాలుగా పరిశోధించినా రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. నీటిని సైతం పరీక్షించినా వాటిలో ఎలాంటి రసాయన మూలకాలు వంటివేమీ లేవని తేలింది. నేటికీ ఈ రహస్యం శాస్త్రవేత్తలకు సవాల్‌గానే ఉంది.

Share this post with your friends
Exit mobile version