Site icon Bhakthi TV

శ్రీవారి లడ్డూ ఇకపై మరింత రుచిగా ఉండబోతోందా?

శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా ఉండబోతోంది. ఈ మేరకు టీటీడీ ఈవో చర్యలు ప్రారంభించారు. లడ్డూ రుచి, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డైరీ నిపుణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. మరింత నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి తదితర అంశాలపై, అందుకు తీసుకోవలసిన మార్పులను తెలియజేయాలని ఆయన నిపుణులను కోరారు.

డైరీ నిపుణులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారు వివరించారు. నాణ్యమైన నెయ్యి ప్రామాణిక విలువల గురించి వారు తమ పిపిటిలో తెలిపారు. త్వరలో లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి సమకూర్చుకోవడానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జెఈఓ శ్రీమతి గౌతమి, ఎస్వి గోశాల డైరెక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి, కొనుగోలు జిఎం శ్రీ మురళీకృష్ణ, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version