Site icon Bhakthi TV

మారేడు చెట్టును ఇంట్లో పెంచాలంటే ముఖ్యంగా ఈ నియమం పాటించాల్సిందే..

భోళాశంకరుడికి ఒక్క మారేడు దళం (బిల్వ పత్రం) సమర్పించినా చాలట. ఆనందంతో కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని అంటారు. మారేడు దళాలంటే శివుడికి అంత ఇష్టమన్నమాట. అభిషేక ప్రియుడైన శివుడిని నిత్యం శివాలయంలో బిల్వార్చన, బిల్వా భిషేకం వంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇక పర్వదినాల సమయంలో అయితే లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. అంతటి విశిష్టత కలిగిన మారేడు చెట్టును ఇంట్లో పెంచితే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందేనట. వాస్తవానికి మారేడు మొక్క ఇంటి ఆవరణలో ఉంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇంటికి మారేడు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుందట. అలాంటి మారేడును ఏ దిశలో పడితే ఆ దిశలో పెంచకూడదు. తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిక్కులలో పెంచడం ద్వారా మనకు మంచి జరగడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం సైతం లభిస్తుందట. పైన పేర్కొన్న ఒక్కో దిక్కులో పెంచితే ఒక్కో లాభం చేకూరుతుందట. తూర్పు దిక్కులో పెంచితే సమస్త సౌఖ్యాలు, ఉత్తర దిక్కులో పెంచితే అఖండ ధన లాభం, ఈశాన్య దిక్కులో పెంచితే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయట. ఇక ఇంట్లో మారేడు చెట్టు ఉంది కదా అని మారేడు దళాలను ఏ రోజు పడితే ఆరోజు కోయకూడదు. బుధ లేదంటే శనివారాల్లో మాత్రమే మారేడు దళాలను తెంపాలని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version