Site icon Bhakthi TV

లక్ష్మీదేవి ఇంట ఉండాలంటే ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి..

లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చాలా మంది ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఎన్ని పూజలు చేసినప్పటికీ కొందరికి అమ్మవారి అనుగ్రహం దక్కడం కష్టమే. దీనికి కారణం కొన్ని తప్పులను తెలియక చేయడమే. అవేంటో తెలుసుకోకుంటే అవే తప్పులు రిపీట్ అవుతుంటాయి. మీరు చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటున్నారు. మరి లక్ష్మీకటాక్షం కలగాలంటే చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సోమవారం నాడు పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదట. దాని వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందట.

మహిళలు మంగళవారం పూట పుట్టింటి నుంచి పొరపాటున కూడా అత్తారింటికి వెళ్లకూడదు. అలాగే కోడలు శుక్రవారం పూట అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్లకూడదట. లక్ష్మీ కటాక్షం కలగాలంటే గోళ్లను ఎప్పుడూ ఇంటి బయట మాత్రమే అది కూడా ఏ రోజు పడితే ఆరోజున కట్ చేసుకోకూడదు. తులసి ఆకులను పొరపాటున కూడా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో కోయకూడదని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం, తల దువ్వుకోవడం వంటివి చేయరాదట. పెరుగు, ఉప్పు వంటివి సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. అలాగే మహిళలు గడప మీద పాదం పెట్టి వెళ్లకూడదు. అలా చేస్తే గడప మీద కాలు పెట్టి వెళ్లడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట.

Share this post with your friends
Exit mobile version